: అబ్బే.. అదెక్కడ.. ఇదెక్కడ!: 'హిరోషిమా' బాంబు శక్తితో 'మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్' సత్తాను పోల్చితే...!

ఆఫ్గన్ పై అమెరికా ప్రయోగించిన ఎంఓఏబీ (మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్) వెల్లడించిన శక్తి అత్యంత తక్కువని ఫాక్స్ న్యూస్ ప్రత్యేక వార్తా కథనాన్ని ప్రచురించింది. దశాబ్దాల క్రితం హిరోషిమాపై ప్రయోగించిన అణుబాంబుతో దీన్ని పోలుస్తూ, ఓ ఆర్టికల్ రాసింది. హిరోషిమా అణుబాంబు శక్తిలో ఒక శాతంలో పదోవంతును మాత్రమే ఎంఓఏబీ విడుదల చేసిందని, రేడియోలాజికల్ ప్రభావం ఏమాత్రమూ లేదని స్టాన్ ఫోర్డ్ వర్శిటీకి చెందిన హోవర్ ఇనిస్టిట్యూషన్ రీసెర్చర్ కోరీ స్చాకే ఈ కథనంలో అభిప్రాయపడ్డారు.

అమెరికా వద్ద ఉన్న అత్యంత తక్కువ అణు ప్రభావాన్ని చూపే బీ-61 సైతం ఎంఓఏబీ కన్నా 30 రెట్ల అధిక ప్రభావాన్ని చూపిస్తుందని మరో వార్తా సంస్థ ఏఎఫ్పీ కథనాన్ని ప్రచురించింది. కాగా, ఒక్కో ఎంఓఏబీ తయారీకి 16 మిలియన్ డాలర్ల వ్యయమవుతుందని, ఇప్పటివరకూ 314 మిలియన్ డాలర్లను ఈ బాంబు ప్రాజెక్టుకు అమెరికా ఖర్చు పెట్టిందని తెలుస్తోంది. దాదాపు పదేళ్ల క్రితమే ఈ తరహా బాంబులు అమెరికా సైన్యం అమ్ముల పొదిలోకి చేరినా, వాడటం మాత్రం ఇదే తొలిసారి.

More Telugu News