: వందేమాతరం పాడబోము... ఏం చేస్తారో చేయండి: ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అల్టిమేటం

తమ రాష్ట్రంలో ఉండాలంటే వందేమాతరం గీతాన్ని తప్పనిసరిగా పాడాల్సిందేనని ఉత్తరాఖండ్ విద్యాశాఖా మంత్రి ధన్ సింగ్ రావత్ ఇచ్చిన ఆదేశాలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఘాటుగా స్పందించారు. "ప్రజలపై ఇంలాంటి నిర్ణయాలు రుద్దడం సరికాదు. మేము మా కార్యక్రమాల్లో వచ్చే నెల రోజుల పాటూ వందేమాతరం పాడబోమని నేను ప్రకటిస్తున్నా. ఏం చేస్తారో చేయండి" అని ఉత్తరాఖండ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ వ్యాఖ్యానించారు.

కిశోర్ ఉపాధ్యాయ ప్రకటనను బీజేపీ చీఫ్ అజయ్ భట్ తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు క్షీణిస్తున్న కాంగ్రెస్ సంస్కృతికి నిదర్శనమని అన్నారు. చిరకాలంగా ప్రతి అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం పాడటం ఆనవాయితీ అని అన్నారు. దీన్ని కూడా రాజకీయం చేయాలని చూడటం కాంగ్రెస్ కుసంస్కృతిగా ఆయన అభివర్ణించారు.

More Telugu News