: అమెరికాను పొగడుతూ, లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా సంగతి కూడా చూడాలని భారత్ వినతి

ఉగ్రవాదుల పీచమణచడమే లక్ష్యంగా అమెరికా అతిపెద్ద బాంబును ప్రయోగించడాన్ని స్వాగతించిన భారత ప్రముఖులు, పనిలో పనిగా పాక్ కేంద్రంగా, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవాల సంగతిని కూడా చూడాలని కోరుతున్నారు. ఈ మేరకు పలువురు బీజేపీ నేతలు, వీఐపీలు సోషల్ మీడియాలో స్పందించారు. "అమెరికా అధ్యక్షుడు మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ తో ఐఎస్ఐఎస్ స్థావరాలపై దాడులు చేయడం సూపర్. ఉగ్రవాదంపై అమెరికా, ఇజ్రాయెల్, ఇండియాలు కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది" అని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ చేశారు.

ఇక కాంగ్రెస్ నేత మనీష్ తివారీ స్పందిస్తూ, "ఐఎస్ఐఎస్ స్థావరంపై యూఎస్ బాంబును జారవిడిచింది. మరి వారికి, లష్కరే తోయిబా, జైషే మోహమ్మద్, జమాత్ ఉద్ దవా ఉగ్రవాదులకూ తేడా ఏంటి? ఉగ్రవాదం ఎక్కడైనా ప్రమాదమే" అని అన్నారు.
కాగా, ఈ బాంబు దాడిపై ట్రంప్ స్పందించారు. అమెరికా సైనిక శక్తిని చూసి తనకెంతో గర్వంగా ఉందని, వారికి అన్ని అధికారాలూ ఇవ్వడంతోనే, మరో సక్సెస్ ను చవిచూశామని అన్నారు. సాధారణ పౌరులకు ఎటువంటి హానీ కలుగకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకునే బాంబును ప్రయోగించినట్టు వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ తెలిపారు.

More Telugu News