: రైలును మధ్యలో వదిలేసి రెండు గంటలపాటు పరారైన డ్రైవర్.. ఎక్కడికక్కడ ఆగిపోయిన రైళ్లు!

అది బీహార్‌లోని బక్సర్ రైల్వే స్టేషన్. ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులతో రైలు కిక్కిరిసిపోయి ఉంది. రైలు బయలుదేరేందుకు గ్రీన్ సిగ్నల్ కూడా పడింది. అయితే నిమిషాలు, గంటలు గడుస్తున్నా రైలు మాత్రం కదలడం లేదు. దీంతో వెనక వస్తున్న రైళ్లన్నీ క్లియరెన్స్ లేక ఎక్కడికక్కడ పట్టాలపై నిలిచిపోయాయి. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు, రైలు అధికారులు గాభరా పడ్డారు. తీరా ఇంజిన్ వద్దకు వెళ్లి చూస్తే డ్రైవర్ ఎంకే సింగ్ కనిపించలేదు.

అలా రెండు గంటలపాటు ఎవరికీ కనిపించకుండా మాయమైన లోకో పైలట్ చివరికి రెండు గంటల తర్వాత మధ్యహ్నం 1.40 గంటలకు తీరిగ్గా వచ్చి క్యాబిన్‌లోకి చేరుకున్నాడు. ఒళ్లు మండిపోయిన ప్రయాణికులు ఎక్కడికెళ్లావని నిలదీస్తే.. ‘ఒళ్లు మండిపోతుంటే స్నానం చేయడానికి వెళ్లా’ అని తీరిగ్గా సమాధానమివ్వడంతో అవాక్కడం అధికారులు, ప్రయాణికుల వంతైంది. ఈ ప్రాంతంలో భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. ఎండలు మండిపోతుండడంతో తట్టుకోలేని డ్రైవర్ ఎంచక్కా స్నానం చేసొచ్చి సేదతీరాడు. ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు.

More Telugu News