: జియో ‘ధ‌న్ ధ‌నాధ‌న్’ ఆఫర్ కు పోటీగా ఎయిర్‌టెల్‌ అద్భుత ఆఫర్!

భార‌త‌ టెలికాం మార్కెట్‌లో రిల‌య‌న్స్ జియో కురిపిస్తోన్న ఆఫ‌ర్ల జోరుని త‌ట్టుకొని నిల‌బ‌డేందుకు ఎయిర్‌టెల్ ఇప్ప‌టికే ఎన్నో ఆఫ‌ర్ల‌ను గుప్పించిన విష‌యం తెలిసిందే. తాజాగా జియో ధ‌న్ ధ‌నాధ‌న్ పేరుతో కొత్త ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టిస్తూ ఆఫ‌ర్ల తుపానుని ఆప‌కుండా ముందుకు వెళుతున్న నేప‌థ్యంలో ఎయిర్‌టెల్ కూడా ధ‌న్ ధ‌నాధ‌న్ ఆఫ‌ర్‌కు పోటీగా అదే స్థాయి సరికొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ఒకదాన్ని ప్రకటించబోతోంది. ఈ కొత్త ప్లాన్‌ ప్రకారం 4జీ వినియోగ‌దారులు రూ.399తో రీచార్జి చేసుకుంటే 70 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1 జీబీ 4జీ డేటా, అప‌రిమిత కాల్స్ పొంద‌వ‌చ్చ‌ని ప్రముఖ టెలికం బ్లాగర్‌ సంజయ్‌ బఫ్నా తెలిపారు.


More Telugu News