: మొబైల్‌ వ్యాలెట్‌ తీసుకువస్తున్న అమెజాన్‌!

ఈ కామ‌ర్స్ సంస్థ అమెజాన్ కూడా భార‌త్‌లో మొబైల్ వ్యాలెట్ స‌ర్వీసును ప్రారంభించనుంది. ఇందుకోసం రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా నుంచి కూడా ఆ సంస్థ‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింది. దీంతో త్వ‌ర‌లోనే ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ (పీపీఐ) లేక‌ మొబైల్‌ వ్యాలెట్‌ను ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపింది. మొబైల్ వ్యాలెట్‌తో భార‌త్ మార్కెట్‌లో త‌మ సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రించాల‌ని యోచిస్తోంది. ఇప్ప‌టికే ఈ స‌ర్వీసును అందిస్తోన్న స్నాప్‌డీల్‌, పేటీఎం వంటి సంస్థ‌ల‌కు అమెజాన్ పోటీ ఇవ్వ‌నుంది. ఈ విష‌యంపై ఆ సంస్థ ప్ర‌తినిధులు మాట్లాడుతూ... ఇక వినియోగదారులకు సౌకర్యవంతంగా, నమ్మకంగా నగదు రహిత సేవలను అందించేందుకు తాము దృష్టిసారిస్తామ‌ని తెలిపారు.

More Telugu News