: మీ సవాలు నిజమేనా? నేను స్వీకరిస్తా: ఈసీతో కేజ్రీవాల్

ఎవరికైనా వీలైతే పది రోజుల్లో ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చని నిరూపించాలని ఎన్నికల కమిషన్ సవాల్ విసిరినట్టు వచ్చిన వార్తలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. "చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నుంచి అధికారిక స్టేట్ మెంట్ అంటూ వచ్చిన ఈ వార్త నిజమేనా?" అని ప్రశ్నించిన ఆయన, తాను ఈ అంశంపై పూర్తి వివరాల కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.

తనకు పది రోజులు అక్కర్లేదని, 24 గంటల్లోనే ఈవీఎంను ట్యాంపర్ చేయవచ్చని నిరూపిస్తానని స్వతహాగా ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. కాగా, ఢిల్లీలోని ఈసీ కార్యాలయంలో ఈవీఎంలను 10 రోజుల పాటు అందుబాటులో ఉంచుతామని, టెక్కీలు, సైంటిస్టులు, ఇతరులెవరైనా వాటిని ట్యాంపర్ చేసి చూపాలని ఈసీ సవాల్ విసిరినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచి ఈవీఎంలను అందుబాటులో ఉంచుతామన్న విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని ఈసీ తెలిపినట్టు కూడా వార్తలు వచ్చాయి.

More Telugu News