: నిశీధిలో భారతావని... నాసా విడుదల చేసిన సరికొత్త స్టన్నింగ్ ఇమేజ్

రాత్రి పూట భారతావని ఎలా కనిపిస్తుంది? అది కూడా అంతరిక్షం నుంచి... ఇప్పటికే నిశీధిలో ఇండియా ఎలా కనిపిస్తుందన్న చిత్రాలను పలుమార్లు విడుదల చేసిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, తాజాగా మరిన్ని అద్భుతమైన ఫోటోలను విడుదల చేసింది. 2012లో భారత నైట్ విజన్ ను విడుదల చేసిన నాసా, తాజా చిత్రాలను కూడా బయటపెట్టింది. ఈ రెండు చిత్రాల్లో తేడా స్పష్టంగా తెలుస్తోంది. పట్టణీకరణలో భాగంగా పెరుగుతున్న నగరాలు, మారుతున్న విస్తరణ తదితరాలను పోల్చేలా ఉన్నాయి. కాగా, మరింత స్పష్టమైన శాటిలైట్ చిత్రాలను తీసేందుకు కృషి చేస్తున్నామని నాసా ఎర్త్ సైంటిస్ట్ మిగుల్ రోమన్ తెలిపారు. ఇందుకోసం కొత్త సాఫ్ట్ వేర్ ను రూపొందిస్తున్నామని అన్నారు.

More Telugu News