: నా ఆరోగ్యం బాగాలేని మాట నిజమే: మాజీ మంత్రి బొజ్జల

తన ఆరోగ్యం బాగాలేని మాట వాస్తవమేనని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఈ ఉదయం తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన, తనకు మరో రెండేళ్లు సమర్థవంతంగా పనిచేసే శక్తి ఉందని, అయినా పదవి నుంచి తొలగించడం కొంత ఇబ్బంది కలిగించిందని అన్నారు. తనను తొలగించిన తరువాత కార్యకర్తలు చాలా బాధ పడ్డారని, తానే వారిని సముదాయించానని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే ఉద్దేశం లేదని, పార్టీలోనే కొనసాగుతానని బొజ్జల స్పష్టం చేశారు. పార్టీని వీడుతానని వచ్చిన వార్తలు అవాస్తవమని తెలిపారు.

More Telugu News