: హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ దుర్మార్గం... కట్టుకున్న భార్యతో శృంగారం లైవ్ స్ట్రీమింగ్

హైదరాబాదుకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ డబ్బు సంపాదన కోసం సభ్యసమాజం ఛీదరించే దుర్మార్గానికి పూనుకున్నాడు. సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... తన భర్తతో గడిపిన ఏకాంత క్షణాలను ఎవరో రహస్యంగా చిత్రీకరించి, అశ్లీల సైట్ లోపెట్టారని ఒక మహిళ హైదరాబాదులోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దానిని ఎవరు? ఎలా చూశారని ప్రశ్నించడంతో... తనకు సమాచారం అందించిన సన్నిహితుల గురించి ఆమె పోలీసులకు వివరించింది. తాను ఏ తప్పు చేయలేదని, తన భర్తతోనే ఏకాంతంగా గడిపానని వివరించింది.

దీంతో కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వీడియోను పోర్న్ సైట్ లో అప్ లోడ్ చేసిన కేరళ వ్యక్తిని పట్టుకుని దీని గుట్టు లాగారు. దీంతో తాను ఒక వెబ్ సైట్ లో మెంబర్ నని, అందులో లైవ్ స్ట్రీమ్ అయినదానిని సేకరించానని వివరించాడు. దీంతో పోలీసులు ఈ వీడియోను లైవ్ స్ట్రీమ్ చేసిన అశ్లీల సైట్ నిర్వాహకులను ప్రశ్నించారు. దీంతో వారు దానిని లైవ్ స్ట్రీమ్ చేసిన ల్యాప్ ట్యాప్ ఐపీ నెంబర్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చారు. దానితో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు షాక్ తిన్నారు. ఎందుకంటే, ఆ లైవ్ స్ట్రీమింగ్ ల్యాప్ ట్యాప్ ఐపీ నెంబర్ సాక్షాత్తూ ఆమె భర్తదే. దీంతో అతనిని అరెస్టు చేసి, విచారణ చేయగా, తాను డబ్బు సంపాదనకు ఈ మార్గాన్ని ఎంచుకున్నానని తెలపడంతో మరింత ఆశ్చర్యపోయారు.

కాగా, సదరు నిందితుడు హైదరాబాదులోని సాఫ్ట్ వేర్ సంస్థలో ఉద్యోగి (33) గా పని చేస్తున్నాడు. జీడిమెట్ల సమీపంలోని చింతల్‌ లో భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతని భార్య ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఆ వ్యక్తి కొంత కాలంగా అశ్లీల సైట్ల వీక్షణ బానిసగా మారాడు. దీంతో ఆ సైట్లలోని వారిలా మారాలన్న కోరికతో పాటు ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించేందుకంటూ కొన్ని సైట్లలో మేల్‌ ఎస్కార్ట్‌ (మగ వ్యభిచారి) గా తన మొబైల్‌ నంబరును రిజిస్టర్‌ చేసుకున్నాడు. దీనిని గుర్తించిన భార్య అతనితో గొడవపడింది.

దీంతో తప్పయిపోయిందని, బుద్ధిగా ఉంటానని ఆమెను నమ్మించాడు. తర్వాత గతంలో తాను రిజిస్టర్ అయిన 3,000 మంది సభ్యులు గల సైట్ కు తన భార్యతో తాను ఏకాంతంగా గడిపిన క్షణాలను లైవ్ స్ట్రీమింగ్ చేశాడు. ల్యాప్ టాప్ లో సినిమా వస్తుండడంతో జరుగుతున్న కుట్ర తెలియని అతని భార్య, అతనితో మామూలుగా గడిపింది. అయితే ల్యాప్ ట్యాప్ లో తన భార్య ఎక్కువ భాగం కనిపించేలా కుట్రపూరితంగా స్ట్రీమ్ చేయడంతో ఆ సైట్ లో సభ్యుడైన కేరళ వ్యక్తి దానిని డౌన్ లోడ్ చేసుకుని, ఇంకొక అశ్లీల సైట్ లో అప్ లోడ్ చేశాడు. దీనిని చూసిన ఆమె సన్నిహితులు ఆమెకు దీని గురించి వివరించారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనిని అరెస్టు చేయడంతో కథ కంచికి చేరింది. 

More Telugu News