: తమిళనాట కలకలం... తమ విధులకు అడ్డుపడ్డారని మంత్రులపై ఐటీ శాఖ ఫిర్యాదు

తమ విధులను తాము చేసుకోనీయకుండా మంత్రులు అడ్డుపడుతున్నారని తమిళనాడు మంత్రులపై ఐటీ శాఖ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. మంత్రులు ఆర్ కామరాజ్, రాధాకృష్ణన్ లతో పాటు, ఢిల్లీలోని తమిళనాడు ప్రత్యేక ప్రతినిధి సుందరంపై ఆదాయపు పన్ను అధికారులు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర మంత్రి విజయభాస్కర్ నేతృత్వంలోనే ఆర్కే నగర్ లో డబ్బులు పంచుతున్నారని తెలిసిన తరువాత, ఆయన ఇంట్లో సోదాలకు వెళ్లినప్పుడు, వీరు తమ అధికారాన్ని ఉపయోగించి అడ్డంకులు సృష్టించారని ఐటీ శాఖ ఫిర్యాదు చేయడం కలకలం సృష్టించింది. కాగా, రాష్ట్ర ఐటీ అధికారుల ఫిర్యాదుపై కేంద్రం స్పందన వెలువడాల్సి వుంది. ఆర్కే నగర్ నియోజకవర్గంలో ఓటుకు రూ. 4 వేల నుంచి రూ. 10 వేల వరకూ పంచుతున్నారని రుజువు కావడంతో ఉప ఎన్నికలను ఎలక్షన్ కమిషన్ రద్దు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News