: అమ్మాయిలు ఈ కొలతలతో ఉంటేనే అందంగా ఉంటారట!: పెను వివాదానికి కారణమైన సీబీఎస్ఈ ప్లస్ టూ పాఠం

సీబీఎస్‌ఈ ప్లస్ టూ (పన్నెండో తరగతి) పాఠ్యపుస్తకంలోని ఒక పాఠ్యాంశం పెను వివాదానికి కారణమైంది. ఈ పాఠ్యాంశంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఆరోగ్యం, వ్యాయామ విద్య అనే పాఠంలో అమ్మాయిలు 36-24-36 కొలతలతో ఉంటేనే అందంగా ఉన్నట్టు అని పేర్కొంది. ఈ పాఠాన్ని డాక్టర్ వీకే శర్మ రాయగా, దీనిని ఓ ప్రైవేటు సంస్థ ముద్రించింది. అయితే ఈ పుస్తకాన్ని తాము సిఫారసు చేయలేదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. ఈ పుస్తకంలో అమ్మాయిలు 36-24-36 కొలతలలో ఉంటే అందగత్తెలుగా గుర్తింపు పొందుతారని, అందాల పోటీల్లోనూ ఈ కొలతలనే లెక్కలోకి తీసుకుంటారని బోధించింది. ఇది విద్యార్థినులపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని, ఇలాంటి అంశాలను పాఠ్యాంశంగా జొప్పించడం ఏంటంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 

More Telugu News