: 50 వేల గ్రామాలకు మొబైల్ నెట్ వర్క్ సేవలు ఇంకా అందుబాటులో లేవట!

డిజిటలైజేషన్ కు అత్యంత ప్రాధాన్యతనిస్తున్న మన దేశంలో 50 వేల గ్రామాలకు మొబైల్ నెట్ వర్క్ సేవలు ఇంకా అందుబాటులోకి రాలేదట. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి మనోజ్ సిన్హా లోక్ సభలో వెల్లడించారు. దేశంలోని ఎన్ని గ్రామాల్లో ఇంకా మొబైల్ సేవలు విస్తరించాల్సి ఉందనే విషయమై తమకు వివరాలు తెలపాలని ఆయా రాష్ట్రాలను కోరినట్టు మంత్రి పేర్కొన్నారు.

ఈశాన్య, నక్సల్ ప్రభావిత రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవుల్లో ఇంకా మొబైల్ సేవలు విస్తరించలేదని తెలిపారు. భారత్ నెట్ పేరిట ఇప్పటికే 100 ఎంబీపీఎస్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టవిటీని దేశంలోని గ్రామ పంచాయతీలకు ప్రకటించామని అన్నారు. తొలి విడతలో లక్ష గ్రామ పంచాయతీల్లో బ్రాడ్ బ్యాండ్ సేవలు అమలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ‘కాల్ డ్రాప్’ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 

More Telugu News