: ఉత్తరకొరియాకు సిరియా స్నేహ హస్తం...కిమ్‌జాంగ్‌కు బషర్ ఫోన్ కాల్!

అమెరికాతో ఎలాంటి యుద్ధానికైనా సిద్ధం అంటూ ప్ర‌క‌టించిన ఉత్త‌ర‌కొరియాతో చేయి క‌లిపేందుకు సిరియా సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. సిరియా వైమానిక స్థావరంపై ఇటీవ‌లే అమెరికా క్ష‌ప‌ణుల‌తో విరుచుకుప‌డ్డ విషయం తెలిసిందే. మ‌రోవైపు ఉత్త‌ర‌కొరియాపై కూడా అమెరికా ఆగ్ర‌హంగా ఉంది. దీంతో ఉత్త‌ర‌కొరియా అధ్య‌క్షుడు కిమ్‌జాంగ్‌కు సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అస్సద్ ఫోన్ చేశారు. 1994కి ముందు కిమ్‌జాంగ్ ఉన్ తాతయ్య ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ ఇల్ సంగ్ జయంతి సందర్భంగా సిరియా అధ్యక్షుడు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ త‌రువాత ఇరు దేశాల నేత‌లు మాట్లాడుకోవ‌డం ఇదే తొలిసారి. కిమ్‌జాంగ్‌తో అల్ అస్సద్ ఫోన్‌లో ఏం మాట్లాడారో తెలియ‌దు.. కానీ, ఒకవేళ ఉత్తర కొరియాపై అమెరికా యుద్ధం ప్రకటిస్తే సిరియా కిమ్ వైపు నిలిచే అవకాశాలు ఉన్నట్లు విశ్లేష‌కులు భావిస్తున్నారు.

More Telugu News