: భారత్‌ అక్రమంగా పరిపాలిస్తున్న ఆ రాష్ట్రంలో ప్రజల జీవితం దుర్భరంగా ఉంది: చైనా

భార‌త్‌పై చైనా మ‌రోసారి త‌న అక్క‌సును వెళ్ల‌గ‌క్కింది. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో అడుగుపెట్టేందుకు దలైలామాకు అనుమ‌తి ఇస్తే చైనా, భార‌త్ మ‌ధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని ఇటీవ‌ల చైనా పేర్కొన్న విష‌యం తెలిసిందే. అయితే, ఆ దేశ హెచ్చ‌రిక‌ల‌ను భార‌త్ ప‌ట్టించుకోని నేప‌థ్యంలో అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ విష‌యంలో చైనా మీడియా ప‌లు వ్యాఖ్య‌లు చేసింది.

‘ఇండియా అక్రమంగా పరిపాలిస్తున్న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ప్రజలు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు’ అని అస‌త్య క‌థానాన్ని ప్ర‌చురించింది. ఆ ప్రాంత ప్ర‌జ‌లు తీవ్ర కష్టాలు పడుతున్నారని, అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు తిరిగి చైనాకు వచ్చేయాలని అనుకుంటున్నార‌ని పేర్కొంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా పేర్కొంటూ ఆ భూ భాగాన్ని చైనా తమదిగా చెప్పుకుంటున్న విష‌యం తెలిసిందే.

More Telugu News