: మద్యానికి వ్యతిరేకంగా తమిళనాడులో ఆందోళన.. మహిళ చెంప ఛెళ్లుమనిపించిన సీనియర్ పోలీస్!

మద్యానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనను అణచివేసేందుకు రంగంలోకి దిగిన ఏడీఎస్పీ ఓ మహిళ చెంపను చెళ్లు మనిపించిన ఘటన తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. మహిళను కొడుతున్న దృశ్యం కెమెరాకు చిక్కడంతో అతను అడ్డంగా బుక్కయ్యాడు.

ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘టస్మాక్’ మద్యం అవుట్‌లెట్లను మూసివేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సాయంత్రం శ్యామలాపురంలో మహిళలు సహా కొందరు రోడ్డును దిగ్బంధించారు. ఆందోళనను విరమించేందుకు మహిళలు నిరాకరించడంతో అడిషనల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పాండ్యరాజన్ ఓ మహిళ చెంపపై లాగిపెట్టి కొట్టారు. మరో ఇద్దరిని బలంగా తోసివేశారు. పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొందరు ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వినట్టు చెబుతున్నారు. దీంతో  పోలీసులు వారిని చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు. మహిళను కొడుతున్న వీడియో బయటకు రావడంతో వైరల్ అయింది. డీఎంకే సహా రాజకీయ పార్టీలు పోలీసు చర్యను నిరసిస్తూ గురువారం ఆ ప్రాంతంలో బంద్ నిర్వహించాయి.

More Telugu News