: శశికళపై ఆంక్షలు విధించిన పరప్పన అగ్రహార జైలు అధికారులు

అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరులోని పరప్పణ అగ్రహార కేంద్ర కారాగారంలో శిక్షను అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమెను పరామర్శించేందుకు అగ్రహార జైలుకు సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో... జైలు అధికారులు ఆంక్షలు విధించారు. జైలు నిబంధనల ప్రకారం జైల్లో ఉన్న ఖైదీ 15 రోజులకు ఒకసారి తన న్యాయవాది, బంధువులు, స్నేహితులతో 15 నిమిషాలు మాత్రమే మాట్లాడాల్సి ఉంది.

అయితే, ఈ నిబంధనలను అతిక్రమించి శశికళ అత్యధికులతో సంభాషించినట్టు తేలింది. 31 రోజుల్లో 28 మందితో శశికళ సంభాషించినట్టు జైలు రికార్డులు చెబుతున్నాయి. అంతేకాదు, 15 నిమిషాలకే పరిమితం కాకుండా 40 నిమిషాలు మాట్లాడారట. దీనికి తోడు ములాఖత్ కోసం జైలు ఆవరణలోని ప్రత్యేక గదిని ఉపయోగించుకున్నారట. ఈ నేపథ్యంలో శశికళను కలిసేందుకు వస్తున్న సందర్శకులను నియంత్రించాలంటూ జైలు అధికారులు ఆదేశించారు. మంత్రులు వచ్చినా అనుమతించవద్దని చెప్పారట. 

More Telugu News