: మళ్లీ వేడెక్కిన తమిళ రాజకీయాలు.. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలంటూ డిమాండ్!: గవర్నర్ ను కలవనున్న డీఎంకే

తమిళనాడు రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఆర్కే నగర్ ఉపఎన్నికల ప్రచారంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు అధికారపక్ష అన్నాడీఎంకే అభ్యర్థి దినకరన్ రూ. 90 కోట్లు ఖర్చు చేశారని తేలడంతో, ఉపఎన్నికను ఈసీ రద్దు చేసింది. ఈ నేపథ్యంలో నగదు పంపిణీకి పాల్పడ్డ అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటూ ప్రతిపక్ష డీఎంకే డిమాండ్ చేస్తోంది. మంత్రి విజయభాస్కర్ తో పాటు, ఇందులో ప్రమేయమున్న మంత్రులందరినీ బర్తరఫ్ చేయాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో, తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావును ముంబైలో నేడు డీఎంకే నేతలు కలవనున్నారు. ఉపఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన అప్రజాస్వామిక చర్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ క్రమంలో, తమిళనాడు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి.

More Telugu News