: అక్కడి మనుషులు నాలుగున్నర అడుగులే వుంటారు....!

‘గలీవర్‌ ట్రావెల్స్‌’ నవల గురించి తెలుసా? పోనీ 'భైరవద్వీపం' సినిమా చూశారా? అందులో బాలయ్యకు సాయం చేసేందుకు మరుగుజ్జులు రంభ తాళం చెవిని దొంగిలిస్తారు. మరీ అంత కాదు కానీ... ప్రస్తుతం నాలుగున్నర అడుగుల మనుషులున్న గ్రామం ఒకటి ఉంది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వలస వచ్చిన పలువురు ఇరాన్‌ లోని దక్షిణ ఖోర్సాన్‌ ప్రాంతంలో ఉన్న బిర్జాండ్‌ నగరానికి 142 కిలోమీటర్ల దూరంలో మఖౌనిక్‌ అనే గ్రామంలో నివాసం ఉంటున్నారు. ఈ గ్రామంలోని మనుషులు కేవలం నాలుగున్నర అడుగుల ఎత్తే ఉండడం విశేషం!

వీరు మట్టితో నిర్మించిన ఇళ్లలో నివాసం ఉంటారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న వీరి సంస్కృతీ సంప్రదాయాలు ఇతరులకు భిన్నంగా ఉండడం విశేషం. వీరు పూర్తిగా శాకాహారులు. అంతే కాకుండా తమ జాతి వారిని మాత్రమే వివాహం చేసుకుంటారు. యాభై ఏళ్ల క్రితం వరకు పొగ తాగడం లేదా టీ, కాఫీలు తాగడం పాపంగా భావించేవారు. ఇప్పుడిప్పుడే వాటికి అలవాటు పడుతున్నారు. ఈ మధ్యే కొందరు మాంసాహారం కూడా తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో వారి జన్యువుల్లో మార్పులు సంభవిస్తున్నాయని అంటున్నారు. ఇప్పుడిప్పుడే వారి పిల్లలు వారి పూర్వీకుల కంటే ఎక్కువ ఎత్తు పెరుగుతుండడం విశేషం. 

More Telugu News