: సిరియా వైమానిక స్థావరంపై దాడికి ట్రంప్ కూతురు కారణమా?

సిరియా వైమానిక స్థావరంపై దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం వెనుక అసలు కథ వేరే ఉందని ట్రంప్ కుమారుడు ఎరిక్ తెలిపాడు. ఐఎస్ఐఎస్ తీవ్రవాదులపై ప్రయోగించిన రసాయన దాడిలో గాయపడిన పిల్లలు, పెద్దలు తీవ్రంగా వేదన అనుభవించిన సంగతి తెలిసిందే. రసాయనదాడి జరిగిన అనంతరం బాధితులపై ఉపశమనం కోసం మందు స్ప్రే చేస్తున్న వీడియో వెలువడ్డ సంగతి తెలిసిందే.

ఈ వీడియోను చూసిన ట్రంప్ కూతురు ఇవాంకా తన గుండె పగిలిపోయిందని చెప్పిందని ‘టెలిగ్రాఫ్‌ పత్రిక’ తెలిపింది. దాడి భయకరంగా ఉందని, తన తండ్రి సకాలంలో చర్యలు తీసుకుంటారని పేర్కొంది. ఆ తరువాతే డొనాల్డ్ ట్రంప్ సిరియా వైమానిక స్థావరంపై దాడికి ఆదేశాలు జారీ చేశారు. అంతకు ముందు గ్యాస్ దాడికి సంబంధించిన చిత్రాలను తన తండ్రి చూశారని, ఆ ఫోటోలు చూసి వేదన చెందారని, దాడికి సంబంధించిన సమాచారం తెలుసుకుని, వైమానిక స్థావరంపై దాడికి ఆదేశాలు ఇచ్చారని ట్రంప్ కుమారుడు ఎరిక్ తెలిపారు. 

More Telugu News