: ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి!

హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఏడాది కాలంలో అత్యధికంగా కార్నియా మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించిన ఘనత సొంతం చేసుకోవడంతో ఈ రికార్డు దక్కినట్టు ఆసుపత్రి వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ జీఎన్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2016 ఏప్రిల్ నుంచి 2017 మార్చి వరకు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో 2043 కార్నియా మార్పిడి శస్త్ర చికిత్సలు చేశామన్నారు. గడచిన ముప్ఫై ఏళ్ల నుంచి ఇప్పటి వరకు చూస్తే.. 23,091 కార్నియా మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించామన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలోని రామాయమ్మ అంతర్జాతీయ నేత్ర నిధి అత్యధికంగా 7,166 నేత్రాలను సేకరించిందని, దేశ వ్యాప్తగా 3,810 మందికి పంపిణీ చేసిందని ఆయన పేర్కొన్నారు.

More Telugu News