: నేటి మ్యాచ్.. బ్యాటింగ్, బౌలింగ్ మధ్య పోరాటమే!

ఐపీఎల్ సీజన్ 10లో నేడు పూణే వేదికగా జరగనున్న మ్యాచ్ ను బౌలింగ్, బ్యాటింగ్ మధ్య జరిగే పోరాటంగా అభివర్ణించవచ్చు. ఎందుకంటే, పూణే సూపర్ జెయింట్ బ్యాటింగే బలంగా బరిలో దిగుతుండగా, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు బౌలింగే బలంగా బరిలో దిగుతోంది. రెండు జట్లు ఆయా విభాగాల్లో విస్తారమైన వనరులు కలిగి ఉన్నాయి. పూణే జట్టు కెప్టెన్ స్మిత్, రహానే, ధోనీ, బెన్ స్టోక్స్, డుప్లెసిస్, మయాంఖ్ అగర్వాల్ తదితరులతో బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా ఉంది.

ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు బౌలింగ్ విభాగంలో కెప్టెన్ జహీర్ ఖాన్, షమి, క్రిస్ మోరిస్, కుమ్మిన్స్, రబడా, మురుగన్ అశ్విన్, జయంత్ యాదవ్ తో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల మధ్య పోరాటం బౌలింగ్, బ్యాటింగ్ మధ్య పోరాటం అని తేల్చిచెప్పవచ్చు. ఇక ఈ రెండు జట్లు ఈ సీజన్ లో చెరొక మ్యచ్ ను ఓడిపోయాయి. పూణే ఒక విజయంతో పాయింట్ల పట్టికలో స్థానం సంపాదించుకుంది.

ఇక పూణే జట్టు బౌలింగ్ విభాగం తాహిర్, స్టోక్స్, ధిండా, ఆడమ్ జంపాతో నెట్టుకొస్తోంది. ఇక బ్యాటింగ్ లో ఢిల్లీది ఘోరమైన పరిస్థితి, ఇప్పటికే ఆ జట్టు నుంచి డుమిని, డికాక్ నిష్క్రమించగా, ఇప్పుడు మాధ్యూస్ కొండంత అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రిషబ్ పంత్ మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ బ్యాట్స్ మన్, కరుణ్ నాయర్, కార్లోస్ బ్రాత్ వైట్, సంజు శాంసన్ తదితరులు బ్యాటు ఝళిపించాల్సిన అవసరం ఉంది. లేదంటే ఢిల్లీ ప్రదర్శనలో ఎలాంటి మార్పు ఉండదనడంలో అతిశయోక్తి లేదు. 

More Telugu News