: శ్రీదేవి కుమార్తె బాయ్ ఫ్రెండ్ తో టెండూల్కర్ కూతురు చెట్టాపట్టాల్!

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాహ్నవి త్వరలోనే దర్శకుడు కరణ్ జొహార్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఇప్పటికే తన లవ్ ఎఫైర్ తో సోషల్ మీడియాలో ఈమె బాగా పాప్యులర్ అయింది. ఇటీవల ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముంబైలో ఓ వేడుక నిర్వహించింది. ఈ వేడుకకు ఫ్రాంచైజీ యజమాని ముఖేష్ అంబానీ, అతని భార్య నీతా అంబానీలతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు, క్రికెటర్లు హాజరయ్యారు. ఈ పార్టీకి జాహ్నవి కపూర్ తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహారియాతో కలసి వచ్చింది. అంతేకాదు, సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా కూడా హాజరైంది. ఈ సందర్భంగా, జాహ్నవి బాయ్ ఫ్రెండ్ శిఖర్, సారా టెండూల్కర్ లు ఒకరిపై మరొకరు చేతులు వేసుకుని, ఫొటోలు దిగారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.


More Telugu News