: ఇక ఆదివారం పెట్రోలు బంకులు తెరుచుకోవు.. మే 14 నుంచి అమలు!

వచ్చే నెల 14వ తేదీ నుంచి ఆదివారాల్లో పెట్రోలు బంకులు ఇక తెరుచుకోకపోవచ్చు. దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ఆదివారాల్లో పెట్రోలు బంకులు మూసివేయాలని ప్రధాని నరేంద్రమోదీ సూచించారు. దీంతో ప్రతి ఆదివారం బంకులకు సెలవు ప్రకటించాలని నిర్ణయించినట్టు భారత పెట్రోలియం డీలర్ల కన్సార్టియం అధ్యక్షుడు ఏడీ సత్యనారాయణ్ తెలిపారు.

మరోవైపు వ్యాపారాల మనుగడ కోసం కమీషన్లు పెంచాలని డిమాండ్ చేస్తున్న డీలర్లు ప్రభుత్వం కనుక స్పందించకుంటే మే 14 నుంచి ప్రతి ఆదివారం బంకులు మూసేయాలని,  మిగతా రోజుల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బంకులు తెరిచి ఉంచే  యోచనలో ఉన్నట్టు పెట్రోల్ బంకుల సంఘాలు హెచ్చరిస్తున్నాయి. అయితే ఈ సంఘాలకు దేశ వ్యాప్తంగా పెద్దగా మద్దతు లేదని చెబుతున్న ఇతర సంఘాలు వారి డిమాండ్లతో మాత్రం ఏకీభవిస్తున్నట్టు పేర్కొన్నాయి.

More Telugu News