: ఎన్డీయే సమావేశంలో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా చంద్రబాబు.. పక్కకు తీసుకెళ్లి మోదీ ఏకాంత చర్చ!

ఎన్డీయే సమావేశంలో చంద్రబాబుకు కీలక ప్రాధాన్యం లభించింది. ప్రధాని నరేంద్రమోదీకి ఓవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా కూర్చోగా మరోవైపు చంద్రబాబు కూర్చున్నారు. కేంద్రంలో ఎన్డీయే అధికారం చేపట్టాక తొలిసారి నిర్వహించిన ఈ సమావేశంలో మూడేళ్లలో ఎన్డీయే సాధించిన విజయాలపై చర్చించారు.  సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో ప్రధాని మోదీ పలుమార్లు మంతనాలు జరిపారు. భేటీ ముగిశాక జరిగిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతోపాటు చంద్రబాబు మాత్రమే పాల్గొన్నారు.

అనంతరం జరిగిన విందులోనూ బాబుకు ప్రాధాన్యం లభించింది. మోదీ, అమిత్‌షా, రాజ్‌నాథ్, చంద్రబాబు ఒకే టేబుల్ వద్ద కూర్చున్నారు. అదే సమయంలో చంద్రబాబును మోదీ పక్కకు తీసుకెళ్లి కాసేపు ఏకాంతంగా మాట్లాడారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు ఉండడంతో అభ్యర్థులపై చంద్రబాబు అభిప్రాయాన్ని మోదీ తెలుసుకున్నట్టు సమాచారం. ఇక చిట్టచివరగా చంద్రబాబుతోపాటు కొద్ది దూరం నడచివచ్చిన మోదీ ఆయనకు వీడ్కోలు పలికారు. మొత్తం 33 పార్టీల అగ్రనేతలు పాల్గొన్న ఈ సమావేశంలో చంద్రబాబు సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.

More Telugu News