: ట్రంప్‌, పుతిన్‌ల మధ్య సత్సంబంధాలు మరింత బలహీనం: నాటో మాజీ కమాండర్‌

ఎన్నిక‌ల స‌మ‌యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ర‌ష్యాకు సానుకూలంగా మాట్లాడిన విష‌యం తెలిసిందే. దీంతో అమెరికా, ర‌ష్యాల మ‌ధ్య సత్సంబంధాలు నెల‌కొంటాయ‌ని ప‌లువురు భావించారు. అయితే, ప్ర‌స్తుతం ట్రంప్ తీరు అందుకు భిన్నంగా ఉంద‌ని నాటో మాజీ కమాండర్‌ జేమ్స్‌ స్టావ్‌రైడిస్ అన్నారు. ప్రపంచంలో మంచిని సపోర్ట్‌ చేసే శక్తిగా రష్యాను డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వ వర్గాలు భావించడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత ప‌రిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్‌, రష్యాల మధ్య సంబంధాలు మ‌రింత బ‌ల‌హీన‌ప‌డ్డాయ‌ని తెలిపారు. ఇటీవల సిరియాలోని షైర‌త్ వైమానిక స్థావ‌రంపై అమెరికా క్షిపణి దాడులు చేసిన‌ నేపథ్యంలో స్టావ్‌రైడిస్ ఇలా త‌న అభిప్రాయాన్ని తెలిపారు. అమెరికా చేసిన ఈ దాడులను రష‍్యా ఖండించిన విష‌యం విదిత‌మే.

More Telugu News