: ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది ఉంటే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు: అసోం సంచలన నిర్ణయం

ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కలిగి ఉన్న దంపతులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులని అసోం రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అలాగే, వివాహానికి చట్టబద్ధమైన వయసు రాని వారు అంటే మైనారిటీ తీరకుండా వివాహం చేసుకున్న వారు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు అనర్హులని ప్రకటించింది. ఈ మేరకు అసోం కొత్త జనాభా పాలసీ వివరాలను రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ వెల్లడిస్తూ, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారి సంక్షేమం, మాతా శిశుమరణాలను అరికట్టడంలో భాగంగా ఈ నిబంధనలు తీసుకొస్తున్నామని అన్నారు. కాగా, బీజేపీ అధికారం చేపట్టిన అసోంలో... బెంగాలీ ముస్లింల జనాభా పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ పాలసీని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు పెరుగుతున్నాయి. 

More Telugu News