: దినకరన్ కు ఈసీ షాక్... ఆర్కేనగర్ ఉపఎన్నిక వాయిదా!

తమిళనాడులోని ఆర్కేనగర్‌ శాసనసభ స్థానానికి ఈ నెల 12న జరగాల్సిన ఉప ఎన్నికను రద్దు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కేనగర్‌ స్థానానికి ఏప్రిల్‌ 12న ఉప ఎన్నిక జరగాల్సిఉండగా అధికార పార్టీ నేతలు ఇప్పటికే ఓటర్లను ప్రభావితం చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక నివేదికను పంపింది. దీనిపై మరో సమగ్ర పరిశీలన అనంతరం ఐటీ అధికారులు రంగంలోకి దిగారు.

ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్‌, నటుడు శరత్‌ కుమార్‌, ఇంకొందరికి చెందిన 32 ప్రాంతాల్లో సోదాలు జరుపగా సుమారు 90 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఓటర్ల కొనుగోలుకు వినియోగించినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఐటీ విభాగం కూడా జాతీయ ఎన్నికల సంఘానికి ఒక నివేదిక ఇచ్చింది. తమ రాజకీయ మనుగడకు కీలకమైన ఎన్నిక కావడంతో శశికళ వర్గం బరితెగించి ఓటుకు 4 వేల రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తోంది. దీంతో సమావేశమైన ఎన్నికల కమీషన్ ఆర్కే నగర్ ఉపఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో తమిళనాట భారీ ఎత్తున పంపకాలు జరిపిన నేతలు షాక్ తిన్నారు. 

More Telugu News