: శ్రద్ధా కపూర్ కోసం మేము గొడవ పడ్డామా... నో!: బాలీవుడ్ హీరో ఫర్హాన్

మహేశ్‌ భట్‌ కుటుంబం ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్లు అయిన సందర్భంగా ఇటీవ‌ల నిర్వహించిన వేడుకలో హీరోయిన్‌ శ్రద్ధా కపూర్ కోసం న‌టులు ఫర్హాన్‌, ఆదిత్య గొడవ పడ్డారని బాలీవుడ్‌లో వార్త‌లు చ‌క్క‌ర్లు కొట్టాయి. ఈ కార్య‌క్ర‌మానికి 'ఆషికీ-2' స్టార్స్‌ ఆదిత్య, శ్రద్ధ జంటగా కలిసి వ‌చ్చారు. 'ఆషికీ-2' సమయంలో వీరిద్దరి మ‌ధ్య‌ ప్రేమ చిగురించింద‌ని, అనంత‌రం వీరు డేటింగ్‌ చేశారని అప్ప‌ట్లో అనుకున్నారు. అయితే, ప్ర‌స్తుతం మాత్రం 'రాక్‌ ఆన్‌ 2'లో తనతో కలిసి నటించిన శ్రద్ధతో ఫర్హాన్‌ డేటింగ్‌ చేస్తున్నాడని కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

అయితే, అప్ప‌టి ప్రేమికులు ఆదిత్య, శ్రద్ధ జంటగా క‌లిసి వ‌చ్చి పార్టీలో పాల్గొన‌డం ఫర్హాన్‌ అఖ్తర్‌కు నచ్చలేదు. త‌న గర్ల్ ఫ్రెండుతో ఆదిత్య అలా తిరుగుతుండ‌డంతో ఫర్హాన్‌ కు చిర్రెత్తుకొచ్చి ఆయ‌న‌పై మండిప‌డ్డాడ‌ట‌. గొడ‌వ మరింత ముదిరి త‌న మాజీ, ప్ర‌స్తుత ప్రేమికులు కొట్టుకునే స్థితికి రావ‌డంతో శ్రద్ధ జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిందని కథనాలు వచ్చాయి. అయితే ఈ కథనాలకు ముగింపు ప‌ల‌కాల‌ని ఫర్హాన్ ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట్ చేశాడు. ‘వాళ్లు ఏవేవో అంటున్నారు.. కానీ మేం ఇలా ఉన్నాం.. రిప్‌ రూమర్స్‌’ అంటూ తాను ఆదిత్యరాయ్‌తో దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. తామిద్ద‌రం గత రాత్రి ఆనందంగా క‌లిసిమెల‌సి ముచ్చ‌ట్లు చెప్పుకున్నామ‌ని పేర్కొన్నాడు.



More Telugu News