: ఇండియ‌న్ నేవీకి థ్యాంక్స్ చెప్పిన‌ చైనీస్ నేవీ!

అవును.. ఇండియ‌న్ నేవీకి చైనీస్ నేవీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పింది. గ‌ల్ఫ్ ఆఫ్ అదెన్‌లో సముద్రపు దొంగలు ఓ కార్గో షిప్ చోరీకి ప్ర‌య‌త్నించారు. మ‌లేషియా, పోర్ట్ ఆఫ్ అదెన్ మ‌ధ్య 21 వేల ట‌న్నుల ఆ కార్గో షిప్ ప్ర‌యాణిస్తున్న స‌మ‌యంలో పైరేట్స్ ఒక్క‌సారిగా దాడికి దిగారు. ఈ విష‌యాన్ని గుర్తించిన‌ యూకే మేరిటైమ్ ట్రేడ్ ఆర్గ‌నైజేష‌న్ అలెర్ట్ పంపించడంతో భార‌త యుద్ధ‌నౌక‌లయిన‌ ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ త‌ర్కాష్ వెంట‌నే స్పందించి రంగంలోకి దిగాయి. ఆ షిప్‌ను ప‌రిశీలించ‌డానికి ఓ హెలికాఫ్ట‌ర్‌ను కూడా పంపించి, ఆ లూటీకి గుర‌వుతున్న‌ షిప్ కెప్టెన్‌తో భార‌త అధికారులు మాట్లాడారు. అనంత‌రం మ‌రోవైపు చైనీస్‌, ఇటాలియ‌న్‌, పాకిస్థాన్ నేవీలు కూడా ఈ విష‌యంపై స్పందించాయి.  

పైరేట్స్ దాడి చేయ‌డంతో ఆ షిప్‌లోని కెప్టెన్‌తోపాటు ఇత‌ర నౌకా సిబ్బంది స్ట్రాంగ్ రూమ్‌లోకి వెళ్లిపోయి, అక్క‌డే దాక్కుని త‌మ‌ను తాము ర‌క్షించుకునే ప్ర‌య‌త్నం చేశారు. మరోవైపు నుంచి చైనా ప్ర‌త్యేక బ‌ల‌గాలు రంగంలోకి దిగి ఆ నౌక‌లోకి వెళ్లాయి. దీంతో పైరేట్స్ వెంట‌నే పారిపోయారు.  షిప్‌లోని సిబ్బంది సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. దీంతో యాంటీ పైర‌సీ మిష‌న్‌లో పాలుపంచుకున్న భార‌త‌ నేవీకి చైనా నేవీ అధికారులు థ్యాంక్స్ చెప్పారు. 2011 నుంచి స‌ముద్ర దొంగ‌ల దాడి పెరిగిపోతోంది.

More Telugu News