: ఎంపీ గైక్వాడ్ పై చట్టపరంగా పోరాటం చేస్తాం: ఎయిరిండియా

ఎయిరిండియా సిబ్బందితో దురుసుగా ప్ర‌వ‌ర్తించి, దాడి చేసిన శివ‌సేన‌ ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌ మీద మొద‌ట‌ నిషేధాన్ని విధించిన విమాన‌యాన సంస్థ‌లు తాజాగా ఆ నిషేధాన్ని ఎత్తివేసిన సంగ‌తి విదిత‌మే. అయితే, ఆయ‌న‌పై నిషేధం మాత్రమే ఎత్తివేశామ‌ని, చట్టపరంగా పోరాటం చేస్తామని ఈ రోజు ఎయిరిండియా అధికారులు స్ప‌ష్టం చేశారు. స‌ద‌రు ఎంపీ చేసిన ర‌భ‌స కార‌ణంగా గ‌త‌నెల 23న ఎయిర్ క్రాఫ్ట్ (ఏఐ 852)ను 90 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చింద‌ని, అందుకు త‌మ‌కు నష్టపరిహారంగా రూ.15 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. ఈ విషయంపై తాము న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యిస్తామ‌ని ఎయిరిండియా చెప్పింది. విమానయాన‌ ఆస్తులకు నష్టం కలిగించకూడదని విమాన సంస్థలు గైక్వాడ్ కు సూచిస్తున్నాయి.

More Telugu News