: దేశంలో ప్రయాణించాలన్నా పాస్‌పోర్ట్‌ లేదా ఆధార్‌ కార్డు వివరాలు సమర్పించాల్సిందే!

విమానంలో విదేశాలకు వెళ్లాలంటే పాస్‌పోర్ట్ త‌ప్ప‌నిస‌రన్న విష‌యం తెలిసిందే. అయితే, ఇక నుంచి దేశం లోపల విమానాల్లో ప్రయాణించాలనుకున్నప్పటికీ పాస్‌పోర్టు వివ‌రాలు కావాల్సిందే.. లేక‌పోతే ఆధార్ కార్డు వివరాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు ఇప్పటివరకు అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించేందుకు ఉన్నాయి. ఇకపై దేశంలో ప్రయాణించే వారిపై కూడా ఈ నిబంధనలు తెచ్చేందుకు గానూ ఈ కీలక మార్పులు చేయ‌డానికి అధికారులు సిద్ధ‌మ‌య్యారు. మూడు లేక‌ నాలుగు నెలల్లో ఈ నిబంధ‌న‌ల‌ను అమలుచేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందుకు సంబంధించి సివిల్‌ ఏవియేషన్‌ రిక్వైర్‌మెంట్‌ (సీఏఆర్)ముసాయిదాను ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులు మ‌రికొన్ని రోజుల్లో దీనిపై ప్రజ‌ల‌ అభిప్రాయాన్ని సేక‌రించనున్నారు. ప్రజలు తమ అభిప్రాయాలను 30 రోజుల్లోగా ఇవ్వాల్సి ఉంటుంది. విమానాల్లో ప్రయాణిస్తూ నిబంధనలు అతిక్రమించేవారి ప‌ట్ల ఇక‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. నాలుగు స్థాయుల్లో వారు చేసిన పనిని బట్టి శిక్ష విధించాల‌ని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అలా నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న‌ల‌కు పాల్పడే వారి పూర్తి వివరాలు తెలుసుకోవాల‌ని యోచిస్తున్నారు. ఈ క్ర‌మంలో ముందస్తుగా టికెట్‌ బుకింగ్‌ చేసుకునే సమయంలో పాస్‌పోర్ట్ లేక‌ ఆధార్‌ను తప్పనిసరి చేయనున్నారు.

More Telugu News