: సన్ రైజర్స్ హైదరాబాదు, హెచ్ సీఏ మధ్య వివాదం... మ్యాచ్ జరగనివ్వమని హెచ్చరికలు

హైదరాబాదు క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) కు, ఐపీఎల్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు మధ్య వివాదం ముదురుతోంది. టికెట్ల పంపిణీ విషయంలో రెండింటి మధ్య వివాదం చోటుచేసుకుంది. ఉప్పల్ మైదానంలో నిర్వహించే ఐపీఎల్ మ్యాచ్ లలో టికెట్లలో స్థానిక క్రికెట్ అసోసియేషన్ కు వాటా ఉంటుంది. టికెట్లు అమ్మడం, అడ్వర్టైజ్ మెంట్లు, ఆటగాళ్ల జెర్సీలపై యాడ్ ఒప్పందాల ద్వారా ఐపీఎల్ జట్ల యజమానులు డబ్బు సంపాదిస్తారు. ఈ వాటా విషయంలోనే రెండింటి మధ్య వివాదం నెలకొంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగే మ్యాచ్ లలో టికెట్ల కేటాయింపులో సన్ రైజర్స్ జట్టు యాజమాన్యం నిబంధనలు పట్టించుకోవడం లేదని హెచ్సీఏ మండిపడుతోంది. సన్ రైజర్స్ యాజమాన్యం ఇలాగే వ్యవహరిస్తే... ఈనెల 17న జరగాల్సిన మ్యాచ్ ని అడ్డుకుంటామని హెచ్సీఏ హెచ్చరించింది. 

More Telugu News