: బాలయ్య ఇంటికి ఎర్త్ పెడుతున్న జీహెచ్ఎంసీ!

తెలుగుదేశం పార్టీ నేత, హిందుపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణ హైదరాబాద్ ఇంటికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ లను నివారించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కొత్త ప్రణాళికలను రూపొందిందించింది. ఇందులో భాగంగా, వివిధ ప్రాంతాల్లో 20 మల్టీ లెవల్ ఫ్లయ్ ఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలను తయారు చేసింది. వీటిల్లో జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు మీదుగా రెండు ఫ్లయ్ ఓవర్లు వెళ్లనుండగా, అందులో ఒకదాని అప్రోచ్ ఫ్లయ్ ఓవర్ డిజైన్ సరిగ్గా బాలకృష్ణ ఇల్లు ఉన్న ప్రాంతం నుంచి వెళ్లనుంది.

ఫ్లయ్ ఓవర్ల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చి, వాటి నిర్మాణం చేపడితే, దశాబ్దాల క్రితం దివంగత ఎన్టీఆర్ కట్టించుకుని, ఆపై బాలకృష్ణకు ఇచ్చిన ఇంటిని కూల్చివేయక తప్పదని సమాచారం. కాగా, తొలిదశలో చేపట్టే వంతెనల నిర్మాణానికి రూ. 2,631 కోట్లు ఖర్చవుతుందని అంచనా. 2019 చివరికి ఎస్ఆర్డీపీని పూర్తి చేయాలని జీహెచ్ఎంసీ టార్గెట్ గా పెట్టుకుంది. పనులు ప్రారంభమైతే, మొత్తం 581 నిర్మాణాలను కూల్చివేయాల్సి వుంటుందని అధికారులు చెబుతున్నారు. వీటిల్లో పలువురు ప్రముఖులు ఇప్పుడుంటున్న నివాసాలు, పలు జంక్షన్లలో ఎంతో కాలంగా ఉంటున్న రెస్టారెంట్ లు, హోటళ్లు కూడా ఉన్నాయి.

More Telugu News