: రండి... కూర్చుని మాట్లాడుకుందాం: ఇండియాకు పాక్ ఆఫర్

ఇరు దేశాల మధ్యా నెలకొన్న అన్ని సమస్యలనూ చర్చల ద్వారా పరిష్కరించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాలను పాకిస్థాన్ పంపింది. ఉగ్రవాదం సహా అన్ని అంశాలపైనా చర్చిద్దామని ప్రతిపాదించింది. "ఉగ్రవాదం గురించి ఇండియా మాట్లాడాలని అనుకుంటే, మేము కూడా అందుకు సిద్ధం" అని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి నఫీస్ జకారియా వ్యాఖ్యానించారు. పాక్ భూభాగంలో భారత్ శాంతి విఘాత కార్యకలాపాలు సాగిస్తోందని, కుల్ భూషణ్ యాదవ్ ఉదంతమే దీనికి నిదర్శనని తెలిపారు. భారత్, పాక్ ల మధ్య మధ్యవర్తిత్వానికి తాము సిద్ధమని అమెరికా చేసిన ప్రకటనను స్వాగతించిన ఆయన, ఈ తరహా మధ్యవర్తిత్వానికి తాము అంగీకరిస్తామని, గతంలోనూ పలు దేశాలు ఇదే ప్రతిపాదనతో వస్తే, భారత్ అంగీకరించలేదని అన్నారు.

More Telugu News