: ఆటోలో కలెక్టరేట్ కు వచ్చిన ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి

ముఖ్యమంత్రి ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లాలంటే ముందు పైలట్ వాహనాలు, సెక్యూరిటీ సిబ్బంది వాహనాలు.. ఇలా పలు వాహనాలు ఉండాల్సిందే. అంతే కాదు, సీఎం వెళ్తున్నారని ఏకంగా ట్రాఫిక్ ను కూడా ఆపేస్తారు . అయితే, ఇందుకు భిన్నంగా ఒక ముఖ్యమంత్రి మహిళ నడుపుతున్న ఆటోలో కలెక్టర్ కార్యాలయానికి వెళ్లిన ఘటన ఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకుంది. ఛత్తీస్ గఢ్ ముఖ్యమత్రి రమణ్ సింగ్ రాయ్ పూర్ లోని సర్గుజ కలెక్టరేట్ కు ఆటోలో వచ్చి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ముఖ్యమంత్రి వెంట ఆటోలో కలెక్టర్ కూడా ప్రయాణించారు. కలెక్టరేట్ లో ఆటోదిగిన అనంతరం ముఖ్యమంత్రి మహిళా ఆటో డ్రైవర్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. 

More Telugu News