: మీకే నైతికత లేకపోతే... ఇక ప్రజలకు ఏం చెబుతారు?: సిద్ధూకి అక్షింతలు వేసిన హైకోర్టు

సోనీ టీవీలో ప్రసారమవుతున్న 'ద కపిల్ శర్మ షో'లో పాల్గొంటున్న మాజీ క్రికెటర్, పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూకి పంజాబ్, హర్యానా హైకోర్టు అక్షింతలు వేసింది. మంత్రి పదవిని నిర్వహిస్తూ, కపిల్ శర్మ టెలివిజన్ షోలో పాల్గొనడం తప్పుకాదని, ఈ టెలివిజన్ షో తన ఆదాయ వనరు అంటూ సిద్ధూ బలంగా వాదించిన నేపథ్యంలో దాఖలైన పిటిషన్ ను విచారించిన సందర్భంగా హైకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది.

సిద్ధూ వ్యాఖ్యలను హైకోర్టు తప్పుపట్టింది. ప్రతి అంశాన్ని చట్టం దృష్టితో చూడకూడదని సూచించింది. బాధ్యతగల మంత్రిగా నైతికత, ఔచిత్యం గురించి కూడా ఆలోచించాలని హితవు పలికింది. మీరే నైతికతను కోల్పోతే..ప్రజలకు ఇక నైతిక అంశాలపై ఏమని వివరణ ఇస్తారని ప్రశ్నించింది. కాగా, 'ద కపిల్ శర్మ షో' నిర్వహణ కపిల్ వ్యవహారశైలి కారణంగా వివాదంలో పడిన సంగతి తెలిసిందే. 

More Telugu News