: సిరియా విషయంలో ర‌ష్యాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన అమెరికా!

సిరియాలో జ‌రిగిన ర‌సాయ‌న దాడుల‌కు ప్ర‌తీకారం అంటూ షైరత్ వైమానిక స్థావరంపై అమెరికా ఈ రోజు క్షిపణులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఓ వైపు ర‌ష్యా చేస్తోన్న హెచ్చ‌రిక‌ల‌ను కూడా లెక్క చేయ‌కుండా అమెరికా ఈ దాడులు నిర్వ‌హించింది. అయితే, ఈ దాడుల‌పై స్పందించిన అమెరికా ప్రభుత్వ సహాయ కార్యదర్శి రెక్స్‌ టిల్లర్సన్ ర‌ష్యాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రసాయన ఆయుధాల బారి నుంచి సిరియాను రక్షిస్తామని 2013లో తీసుకున్న బాధ్యతను నిర్వర్తించడంలో ర‌ష్యా ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని అన్నారు.

అమెరికా, ర‌ష్యా దేశాల మధ్య కీలక ఒప్పందాలు చేసుకునేందుకు వ‌చ్చే వారం అమెరికా ప్రతినిధిగా టిల్లర్సన్‌ రష్యా పర్యటనకు వెళ్ల‌నున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఇటువంటి వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికాలో డొనాల్డ్‌ ట్రంప్ స‌ర్కారు ఏర్పడిన తర్వాత ఆ దేశ‌ ప్రతినిధిగా మొద‌టిసారి రష్యాలో ఆయ‌న ప‌ర్య‌టించ‌నున్నారు.  

More Telugu News