: 27న కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ.. కేబినెట్‌లోకి రాజస్థాన్ సీఎం వసుంధర?

కేంద్ర కేబినెట్‌ను విస్తరించాలని భావిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ అందుకు ఈ నెల 27ను ముహూర్తంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలో భారీ మార్పులు చేయాలని భావిస్తున్న మోదీ సుష్మాస్వరాజ్ స్థానంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేను తీసుకోవాలని దాదాపు నిర్ణయించినట్టు సమాచారం. వసుంధర స్థానంలో బీజేపీ సీనియర్ నేత ఓఎం మాథూర్‌ను రాజస్థాన్ సీఎంగా నియమించనున్నారు.

కేంద్ర విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్‌కు ఆర్థిక మంత్రిగా ప్రమోషన్ ఇచ్చి, జైట్లీ తాత్కాలికంగా నిర్వహిస్తున్న రక్షణశాఖను ఆయనకే పూర్తిస్థాయిలో కట్టబెట్టాలని మోదీ యోచిస్తున్నారు. సీనియర్ మంత్రులు నిర్వహిస్తున్న రెండుమూడు శాఖలను తగ్గించి వాటిని యువ ఎంపీలకు అప్పగించనున్నారు. ఇక యూపీ సీఎం రేసులో కడదాకా నిలిచిన కేంద్రమంత్రి మనోజ్ సిన్హాకు కూడా పెద్ద శాఖ ఇచ్చి ప్రమోషన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే మిత్రపక్షాలకు కూడా కేబినెట్‌లో సముచిత స్థానం ఇవ్వనున్నట్టు విశ్వసనీయ సమాచారం.


 

More Telugu News