: తాజ్ మహల్ అందాన్ని కాపాడేందుకు ముల్తానీ మిట్టీ పేస్ట్ తో మేకప్!

ప్రపంచ వింతల్లో ఒకటైన ఆగ్రాలోని పాలరాతి కట్టడం తాజ్ మహల్ అందాన్ని కాపాడేందుకు, వాతావరణ కాలుష్యం బారి నుంచి పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ‘మడ్ థెరపీ’ ద్వారా తాజ్ మహల్ రంగు మారకుండా ఉండేలా చూడనున్నారు. ఈ థెరపీ ద్వారా తాజ్ మహల్ పై పూత వేస్తారు. దీంతో, వాతావరణ, వాయు కాలుష్యాల ప్రభావం ఆ కట్టడంపై పడకుండా ఉంటుంది. తద్వారా తాజ్ మహల్ రంగు మారకుండా ఉంటుంది. ఈ సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేష్ శర్మ మాట్లాడుతూ, ముల్తానీ మిట్టీ పేస్టును ఉపయోగించి తాజ్ మహల్ కు పూత వేస్తారని, తాజ్ మహల్ అసలు రంగు దెబ్బతినకుండా ఈ పూత కాపాడుతుందని, ఇందుకు సంబంధించిన నివేదికను నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ సమర్పించిందని మహేష్ శర్మ తెలిపారు.

More Telugu News