: సమర్థమైన మంత్రి వర్గాన్ని తీసుకురావడానికి ఎంతో కసరత్తు చేశాం: సీఎం చంద్రబాబు

ఒక సమర్థమైన మంత్రి వర్గాన్ని తీసుకురావడానికి ఎంతో కసరత్తు చేశామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిలో నిర్వహించిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం రెండున్నర గంటల పాటు సాగింది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ఏడు మిషన్లపై  కొత్త మంత్రులు అవగాహన పెంచుకోవాలని, ఫలితాల సాధనలో మంత్రులు, అధికారులకు సమాన బాధ్యత ఉంటుందని చెప్పారు. రాజకీయ నిర్వహణతో పాటు పాలనా సామర్థ్యం ముఖ్యమేనని అన్నారు.

వంద శాతం నాణ్యత ఉన్న విద్యుత్ ఇవ్వడం సంతృప్తి నిస్తోందని, ప్రతి శాఖ కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. కామన్ లే ఔట్ రూల్స్ కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ పరిధి మినహా రాష్ట్రం మొత్తం ఒకే విధానం అమలులో ఉంటుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం ముఖ్యమైన అంశమని, విభజన తర్వాత ఇబ్బందులు ఉన్నా పరిపాలనను గాడిలో పెట్టగలిగామని అన్నారు. కలిసికట్టుగా పనిచేయడం వల్లే మెరుగైన ఫలితాలు సాధించగలిగామని, మారుతున్న సాంకేతికత, లక్ష్యాల ఆధారంగా పనిచేయాలని సూచించారు. మరో పదేళ్లలో దేశంలోని మూడు ప్రధాన రాష్ట్రాల్లో ఏపీ ఉండాలని అన్నారు.

More Telugu News