: ‘ట్రూకాలర్’ యాప్ లో మరిన్ని అదిరిపోయే ఫీచర్లు!

మ‌న‌కు తెలియ‌ని మొబైల్ నుంచి కాల్ వ‌స్తే ఆ నెంబ‌రు ఎవ‌రిదో వెంట‌నే తెలుసుకోవాలంటే ఉప‌యోగ‌ప‌డే ‘ట్రూ కాల‌ర్’ యాప్‌లో మ‌రిన్ని సౌక‌ర్యాలు రానున్నాయి. భార‌త్‌లో పెరుగుతున్న న‌గ‌దురహిత లావాదేవీల దృష్ట్యా ఈ యాప్‌లో ఇక‌పై బ్యాంకింగ్ సేవ‌లు ప్రారంభ‌మ‌వుతాయ‌ని ఆ యాప్‌ ప్రతినిధులు తెలిపారు. అంతేకాదు, వీడియో కాల్స్‌, మొబైల్ రీఛార్జ్ వంటి సేవ‌ల‌ను కూడా తీసుకురానున్న‌ట్లు తెలిపారు. ఇందు కోసం తాము ఇప్ప‌టికే ఐసీఐసీఐ బ్యాంకుతో ఒప్పందం చేసుక‌ున్నామ‌ని చెప్పారు. ఈ సౌక‌ర్యం ద్వారా యూపీఐ ఐడీ, భీమ్ యాప్‌తో అనుసంధానమై ఉన్న అన్ని మొబైల్ నెంబర్లకు న‌గ‌దు పంపుకోవ‌చ్చ‌ని తెలిపారు.

మ‌రోవైపు మెసేజ్ ఇన్‌బాక్స్‌ను పూర్తిగా యాక్సెస్ చేయగలిగేలా ఎస్ఎంఎస్ సౌకర్యాన్ని కూడా త‌మ యాప్‌లో తీసుకువ‌స్తున్న‌ట్లు చెప్పారు. ఈ ఫీచ‌ర్‌తో మెసేజ్‌లు సెండ్ చేయ‌డం, స్పామ్ మెసేజ్‌ల‌ను గుర్తించ‌డం వంటి సౌక‌ర్యాలు క‌ల్పించ‌నున్న‌ట్లు తెలిపారు. మ‌రోవైపు నెట్ కనెక్షన్ లేకుండానే త‌మ యూజ‌ర్ల‌ మొబైల్‌కు ఎవరు కాల్ చేస్తున్నారో తెలుసుకునేందుకు ఎయిర్‌టెల్‌తో కలిసి ‘ఎయిర్‌టెల్ ట్రూ కాలర్ ఐడీ’ ఆప్షన్‌ను కూడా ఈ యాప్ అందుబాటులో ఉంచ‌నుంది.

More Telugu News