: తమిళ రాజకీయాల్లో సరికొత్త సీన్... శశికళ వర్గానికి మద్దతు ప్రకటించిన శరత్ కుమార్

తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇంతవరకు సినీ పరిశ్రమ మొత్తం పన్నీరు సెల్వానికి మద్దతు ప్రకటించినట్టు వ్యవహరించగా, తాజాగా కోలీవుడ్ హీరో శరత్ కుమార్ మాత్రం శశికళ వర్గానికి మద్దతు ప్రకటించడం ఆసక్తి పెంచుతోంది. గతంలో అన్నాడీఎంకే మద్దతుదారుగా ఉన్న శరత్ కుమార్...తరువాత పార్టీకి దూరమయ్యారు.

తరువాత డీఎంకే-తమిళమాలిన కాంగ్రెస్ కు మద్దతు తెలిపారు. కాల క్రమంలో దానికి కూడా దూరమై 2007లో సొంతంగా ఆల్ ఇండియా సమతువ మక్కల్ కచ్చి పేరుతో పార్టీ పెట్టిన శరత్ కుమార్ కు ఊహించిన ఆదరణ లభించలేదు. దీంతో పార్టీని మూసేసి మౌనంగా ఉన్నారు. మళ్లీ ఇన్నాళ్ల తరువాత శశికళ వర్గం తరపున పోటీ చేస్తున్న దినకరన్ కు మద్దతు తెలిపారు. ఆయనకు సంఘీభావంగా ఆర్కేనగర్ లో ఉన్న ఆయనను కలిశారు.

కాగా, ఈ నెల 12న ఆర్కేనగర్ ఉపఎన్నిక జరగనుంది. డీఎంకే అభ్యర్థిగా మరుదు గణేషన్, అన్నాడీఎంకే పురట్చితలైవి అమ్మ (పన్నీర్ సెల్వం వర్గం) అభ్యర్థిగా మధుసూదనన్, స్వతంత్ర అభ్యర్థిగా జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌, అన్నాడీఎంకే (శశికళ వర్గం) దినకరన్, సీపీఎం అభ్యర్థిగా లోకనాథన్, బీజేపీ అభ్యర్థిగా గంగై అమరన్, డీఎండిడీకే అభ్యర్థిగా మదివానన్, నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థిగా కలైకోట్‌ ఉదయంలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు ఆర్కేనగర్‌ లో పోటీ చేస్తున్నారు.

More Telugu News