: ఎయిరిండియా విమానాలు ఎలా ఎగురుతాయో మేమూ చూస్తాం: పార్లమెంటులో శివసేన ఎంపీలు

ఎయిరిండియా సిబ్బందిపై శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చేయి చేసుకోవడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈరోజు పార్లమెంటులో కూడా ఈ విషయంపై గందరగోళం చెలరేగింది. గైక్వాడ్ మాట్లాడుతూ, తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను దోషిని కాదని చెప్పారు. విమానాల్లో ప్రయాణించే హక్కును తనకు రాజ్యాంగం కల్పించిందని... ఆ హక్కును ఎయిర్ లైన్స్ సంస్థలు ఎలా కాదంటాయని ప్రశ్నించారు. ఈ సందర్భంగా విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, తమకు ప్రజల భద్రతే ముఖ్యమని, జరిగిన విషయంలో రాజీ పడబోమని చెప్పారు. దీంతో, శివసేన ఎంపీలు అశోక్ గజపతిరాజును చుట్టుముట్టి, ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరికొందరు శివసేన ఎంపీలైతే... అసలు ముంబై నుంచి ఎయిరిండియా విమానాలు ఎలా ఎగురుతాయో చూస్తామంటూ హెచ్చరించారు. 

More Telugu News