: ఆ గాయకుడు అంటే నాకు ఇష్టం: హీరో ప్రభాస్

సుమారు నాలుగేళ్ల క్రితం విడుదలైన హీరో ప్రభాస్ ‘మిర్చి’ చిత్రంలో ‘పండగలా దిగి వచ్చాడు..’ పాట పాడిన బాలీవుడ్ గాయకుడు కైలాష్ ఖేర్ గుర్తుండే ఉంటారు. ఆ గాయకుడు అంటే హీరో ప్రభాస్ కు చాలా ఇష్టమట. ఎప్పటికీ కైలాష్ ఖేర్ కు తాను అభిమానినని ప్రభాస్ చెప్పాడు. ‘బాహుబలి-2’ హిందీ వెర్షన్ పాటలను ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ ఆల్బమ్ ను ప్రభాస్ షేర్ చేశాడు. ‘బాహుబలి-2’లో తనకు ఇష్టమైన హిందీ పాటను కైలాష్ ఖేర్ పాడాడని, ఈ పాట అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని ఆ పోస్ట్ లో ప్రభాస్ పేర్కొన్నాడు. కాగా, ఈ నెల 28న ‘బాహుబలి-2’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News