: డెత్ ఓవర్ల బౌలింగే కీలకం: భువనేశ్వర్ కుమార్

ఐపీఎల్ సీజన్-10 నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం 8 గంటలకు డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు రన్నర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడనుంది. ఈ నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాదు జట్టు స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మాట్లాడుతూ, డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగుతుండడంతో తమపై భారీ అంచనాలు ఉన్నాయని అన్నాడు. అయితే అభిమానుల అంచనాలు అందుకునేందుకు శ్రమిస్తామని చెప్పాడు.

టీ20ల్లో డెత్ ఓవర్లు కీలకమైనవని అభిప్రాయపడ్డాడు. తొలి ఓవర్ నుంచి దూకుడుగా ఆడినప్పటికీ చివర్లో ప్రతి బ్యాట్స్ మన్ వీలైనన్ని పరుగులు పిండుకునేందుకు ప్రయత్నిస్తాడని తెలిపాడు. అందుకే చివరి 5 ఓవర్లు ఎవరు అద్భుతంగా బౌలింగ్ చేయగలిగితే ఆ జట్టు విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయని చెప్పాడు. తమ జట్టుకు బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ వనరులు కూడా బాగున్నాయని కితాబునిచ్చాడు. ఈసారి టైటిల్ ను నిలబెట్టుకోవడం కీలకమని భువనేశ్వర్ తెలిపాడు. 

More Telugu News