: న్యూయార్క్ కన్నా మూడు రెట్లు పెద్ద నగరాన్ని నిర్మించనున్న చైనా!

అమెరికాను అన్ని రంగాల్లో వెనక్కి నెట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న చైనా తాజాగా సరికొత్త నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. చైనా అధికార మీడియా వర్గాల కథనం ప్రకారం అమెరికాలోని న్యూయార్క్ నగరం కంటే మూడు రెట్లు పెద్దదైన నవీన నగరాన్ని నిర్మించాలని చైనా నిర్ణయించింది. బీజింగ్, టియాన్జిన్, హెబీ నగరాల మధ్య వంద కిలోమీటర్ల పరిధిలో జియాంగ్ అనే సరికొత్త నగరాన్ని చైనా అభివృద్ధి చేయనున్నట్లు తెలుస్తోంది.

కేవలం వంద కిలోమీటర్ల విస్తీర్ణంతోనే ఈ నగరం ఆగిపోదని, భవిష్యత్ లో దీని విస్తీర్ణం 200 కిలోమీటర్ల పరిధి నుంచి 2000 కిలోమీటర్ల పరిధికి విస్తరించనున్నట్టు చైనా అధికార మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ జియాంగ్ నగరాన్ని నిర్మించడం ద్వారా బీజీంగ్ పై ఒత్తిడి తగ్గించాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది. బీజింగ్ లో పెరిగిపోయిన ట్రాఫిక్, వాయు కాలుష్యాన్ని నియంత్రించాలంటే అభివృద్ధిని వికేంద్రీకరించాలని, అందుకు సరికొత్త నగర నిర్మాణం ప్రత్యామ్నాయం అని చైనా భావిస్తోంది. మరి ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. 

More Telugu News