: 90 లక్షల ఎఫ్డీలు, 4 కేజీల బంగారం, కోటి నగదు...గంగాధరం అక్రమార్జితం

రోడ్లు, భవనాల (ఆర్ అండ్ బీ) శాఖలో ఈఎన్సీగా పని చేస్తున్న గంగాధరం ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించాడన్న ఫిర్యాదులతో రంగంలోకి దిగిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విభాగం తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే...మూడు రోజులపాటు జరిగిన తనిఖీల్లో ఈడీ అధికారులు గంగాధరం నివాసం, అతని బంధువుల ఇళ్లు, బ్యాంకు లాకర్ల నుంచి భారీ ఎత్తున అక్రమాస్తులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 90 లక్షల రూపాయల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు, వివిధ బ్యాంకు లాకర్లలో 4 కేజీల బంగారం, అతని నివాసం, అతని స్నేహితుల ఇళ్ల నుంచి కోటి రూపాయలకుపైగా నగదు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ తెలిపారు. అలాగే ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న కోటి రూపాయల నగదులో ఎక్కువ శాతం 2 వేలనోట్లు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ఆయన షెల్ కంపెనీలపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. 

More Telugu News