: ఒక్క పైసా తీసుకోకుండానే వీసా... మలేషియా కీలక నిర్ణయం

తమ దేశానికి ప్రయాణమయ్యే భారతీయులు ఒక్క పైసా కూడా చెల్లించకుండానే వీసాలను ఇవ్వనున్నట్టు మలేషియా ప్రకటించింది. భారత్ లో పర్యటించిన తొలి మలేషియా ప్రధానిగా రికార్డు సృష్టించిన నజీబ్ రజాక్, ఇకపై ఆన్ లైన్ ద్వారా భారతీయులు వీసా నిమిత్తం దరఖాస్తు చేసుకుంటే, 48 గంటల్లోనే అనుమతులు ఇస్తామని తెలిపారు. ఇండియా, మలేషియాల మధ్య ఎన్నో సారూప్యతలున్నాయని, భారతీయ భాషలను మాట్లాడేవారు మలేషియాలో ఎంతో మంది ఉన్నారని, ఇక్కడి సంస్కృతి, ఆహారం మలేషియాలోని అన్ని ప్రాంతాల్లో మిళితమైందని రజాక్ అన్నారు. తాను భారతీయ సినిమాలకు అభిమానినని చెప్పారు. ఇండియాతో మరింత ద్వైపాక్షిక బంధాన్ని తాము కోరుకుంటున్నామని, విద్య, వైద్య, ఉగ్రవాద వ్యతిరేక, ఆహార భద్రత విభాగాల్లో ఇండియా సహకారాన్ని కోరుతున్నామని చెప్పారు. తన భారత పర్యటనలో భాగంగా ఏడు అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేసినట్టు తెలిపారు.

More Telugu News