: హైవేలపై మద్యం షాపులను కొనసాగించేందుకు రాజస్థాన్ ప్రభుత్వం కొత్త ఎత్తుగడ!

జాతీయ, రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాల తొలగింపుపై సుప్రీంకోర్టు ఆదేశాలు అమల్లోకి వచ్చిన తరువాత, తమకు వచ్చే ఆదాయాన్ని కోల్పోతామన్న ఉద్దేశంతో రాజస్థాన్ కొత్త ఎత్తుగడ వేసింది. జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల గుండా వెళ్లే జాతీయ, రాష్ట్ర రహదారులను పట్టణ రహదారులుగా మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వన్ టైం నోటిఫికేషన్ తెస్తూ, బైపాస్ రోడ్డులకు కనెక్టివిటీ ఉన్న అన్ని పట్టణ ప్రాంత జాతీయ, రాష్ట్ర రహదారులూ పట్టణ రహదారులేనని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, తాలూకాలు, పంచాయితీల పరిధిలో సాగే రహదారులపై మద్యం షాపులను తొలగించాల్సిన అవసరం ఉండదు. ఇక ఆయా పట్టణాలు, నగరాల పరిధిని దాటిన తరువాత ఉండే మద్యం షాపులనే తీసివేయాల్సి వుంటుంది.

More Telugu News